![]() |
![]() |

బిగ్ బాస్ సీజన్-8 లో తొలి కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన యష్మీ పన్నెండో వారం ఎలిమినేట్ అయ్యింది. హౌస్ లో తన ఆటతీరు, మాటతీరు పూర్తిగా అర్థం చేసుకున్న ఆడియన్స్ తనపై నెగెటివిటిని పెంచేసుకున్నారు.
ప్రతీవారం తను నామినేషన్ కి రావడం ఆమె స్థానంలో ఎవరో ఒకరు ఎలిమినేషన్ అయి బయటకు రావడంతో తను ఇన్ని వారాలు తప్పించుకుంది. ఇక ఈ వారం మాత్రం ప్రేక్షకుల పంతం నెరవేరింది. వారు కన్న కల నెరవేరింది. తను ఎలిమినేషన్ అయ్యింది. ఇక నుండి బిగ్ బాస్ హౌస్ ప్రశాంతంగా ఉంటుందంటూ నెటిజన్లు ట్రోల్స్ కూడా మొదలెట్టారు. యష్మీ గౌడ సుమారుగా వారానికి రూ. 2 లక్షల పారితోషికం తీసుకుందని సమాచారం. అంటే, రోజుకు దాదాపుగా రూ. 28, 571. సెప్టెంబర్ 2న ప్రారంభమైన బిగ్ బాస్ 8 తెలుగులోకి ఫస్ట్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన యష్మీ గౌడ 12 వారాలు (దాదాపుగా 83 రోజులు) హౌజ్‌లో ఉంది. ఈ లెక్కన 12 వారాల్లో యష్మీ గౌడ రూ. 24 లక్షల వరకు రెమ్యునరేషన్ అందుకుందని తెలుస్తోంది. అయితే, యష్మీ గౌడ వారానికి రెండున్నర లక్షల రూపాయల పారితోషికం అందుకుందని మరో టాక్ కూడా నడుస్తోంది.
యష్మీ గౌడ ఎలిమినేషన్ అయ్యాక నెట్టింట మొదలైన టాపిక్ ఏంటంటే.. హమ్మయ్య కన్నడ బ్యాచ్ నుండి పెద్ద పాము బయటకొచ్చేసింది. ఇంకా మూడు పాములున్నాయంటూ తెగ ట్రోల్స్ చేసేస్తున్నారు. వీళ్ళంతా నామినేషన్ కి ముందు గ్రూప్ గా మాట్లాడుకొని ఒకరిని టార్గెట్ చేయడం ఆడియన్స్ దృష్టిలో నెగెటివ్ అయ్యారని తెలుస్తోంది.
![]() |
![]() |